ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి... బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. అనుముల గ్రామానికి చెందిన మిట్టపల్లి పార్వతమ్మ.. భర్త పొలం పనులుకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంటి పక్కనే ఉంటున్న జోషి... పార్వతమ్మ ఇంట్లోకి వెళ్లి ఆమెపై దాడి చేశాడు. బాధితురాలి గొంతును చీరతో చుట్టి.. ముఖంపై పిడి గుద్దులు కురిపించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
పక్కింటి మహిళపై యువకుడి దాడి.. బంగారంతో పరార్ - బంగారంతో పరార్
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి ఆభరణాలు దోచుకెళ్లాడో యువకుడు. బాధితురాలిని బంధించి.. ఆపై క్రూరంగా దాడి చేసి సొత్తు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.
పక్కింటి మహిళపై యువకుడి దాడి.. బంగారంతో పరార్
బాధితురాలి ఒంటి మీదున్న ఆభరణాలు తీసుకొని... ఇంటి గడియ పెట్టేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన పార్వతమ్మ జరిగిందంతా భర్తకు చెప్పి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని హాలియా సీఐ వీర రాఘవులు తెలిపారు.