తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాధిగ్రస్థ చిన్నారుల ఆకలి తీర్చిన వ్యాపారులు

లాక్​డౌన్​ నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని ఆకలితో అలమటిస్తున్న వ్యాధిగ్రస్థ చిన్నారులను ఇద్దరు వ్యాపారులు చేరదీశారు. వారి ఆకలితీర్చడానికి అవసరమైన సామగ్రిని అందించి మనసున్న మారాజులనిపించుకున్నారు.

Two marchants cater to the hunger of sick children in Nalgonda district
వ్యాధిగ్రస్థ చిన్నారుల ఆకలి తీర్చిన మారాజులు

By

Published : Apr 5, 2020, 4:49 PM IST

లాక్​డౌన్ దృష్ట్యా నిత్యావసరాల కొరత వల్ల ఆకలితో అలమటిస్తున్న వ్యాధిగ్రస్థ చిన్నారులకు నల్గొండలోని ఇద్దరు వ్యాపారులు ఆపన్నహస్తం అందించారు. జిల్లా కేంద్రంలోని భాగ్యలత చిట్​ఫండ్స్ యజమానులు శ్రీనివాస్, డీవీఎన్ రెడ్డి చిన్నారులకు కావాల్సిన సామాగ్రి వితరణకు ముందుకొచ్చారు.

స్థానిక డీఎస్సీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా... చిన్నారుల ఆకలి తీర్చే సరుకులను అందజేశారు. బాలసదన్​తోపాటు చారుమతి చైల్డ్ కేర్​లోని పిల్లలకు సరకులు అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. 60 మంది ఎయిడ్స్ వ్యాధి బాధిత చిన్నారులకు 60 వేల రూపాయల విలువైన వస్తువులు అందజేసి మనసున్న మారాజులుగా నిలిచారు.

వ్యాధిగ్రస్థ చిన్నారుల ఆకలి తీర్చిన మారాజులు

ఇవీ చూడండి: సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details