తెలంగాణ

telangana

ETV Bharat / state

తాటిచెట్ల ధ్వంసం.. అబ్కారీ పోలీసులకు ఫిర్యాదు - అబ్కారీ అధికారులకు ఫిర్యాదు

కల్లు పారుతున్న చెట్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా బొల్లేపల్లికి చెందిన ఓ వ్యక్తి అబ్కారీ శాఖ అధికారులను ఆశ్రయించాడు. తనకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.

toddy tree cutting in bollepalli and complaint to excise police
తాటిచెట్ల ధ్వంసం.. అబ్కారీ పోలీసులకు ఫిర్యాదు

By

Published : Apr 13, 2020, 8:45 PM IST

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం బొల్లేపల్లిలో తాటిచెట్లను నరికి వేసినట్టు నర్సింగ్ శంకరయ్య గౌడ్​ అబ్కారీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో కల్లు పారుతున్న తాటిచెట్లను... తన భూమిలో ఉన్నవి అనే నెపంతో ఎలాంటి అనుమతి లేకుండా జేసీబీతో ధ్వంసం చేసినట్టు ఆరోపించాడు.

ఎందుకు చేశారని అడిగితే దౌర్జన్యం చేస్తూ... ఏం చేసుకుంటావో చేస్కో అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు చట్టరీత్యా నేరం కాబట్టి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తగిన న్యాయం చేయాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం విజ్ఞప్తి చేసింది.

ఇదీ చూడండి:ఎన్నికల కమిషనర్ల​ జీతాల్లో 30 శాతం కోత

ABOUT THE AUTHOR

...view details