ఎన్నికల ఫలితాల అనంతరం తొలి భేటీ
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక... పార్టీ రాష్ట్ర నాయకత్వం తొలిసారి నాగార్జునసాగర్‌లో పీసీసీ ఆపీసు బేరర్ల సమావేశం నిర్వహిస్తోంది. వరుస పరాజయాలతో తీవ్ర నిర్వేదనతో ఉన్న కాంగ్రెస్.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసే దిశలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.
ఉత్తమ్, కుంతియా సహా హాజరుకానున్న సీనియర్లు
ఇవాళ జరగనున్న సమావేశంలో ఆహ్వానితులు మాత్రమే పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అందులో ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీసీసీ అఫీసు బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఛైర్మన్లు, సీఎల్పీ మాజీ నేతలు, పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రులు తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
రాజగోపాల్ షోకాజ్ నోటీసుపై చర్చించే అవకాశం
ఇప్పటికే అన్ని స్థాయిల నేతలకు కలిపి 120 మందికి పైగా ఆహ్వానం పంపారు. వారిలో ఎంత మంది హారవుతారు, ఎంత మంది గైర్హాజరవుతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే 120 మందికి పైగా అంచనాతో అక్కడ ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నేతలు వివరించారు. 12 మంది ఎమ్మెల్యేలు కారెక్కడం మరో ఎమ్మెల్యే పార్టీని ధిక్కరించి మాట్లాడడం, ఆయనకు ఇచ్చిన షోకాజ్ నోటీసు దానికి ఇచ్చిన వివరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం - NAGARJUNASAGAR
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇవాళ నాగార్జున సాగర్‌లో పీసీపీ ఆఫీసు బేరర్ల సమావేశం నిర్వహిస్తోంది. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ పరంగా వ్యూహరచన చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది.
నాగార్జున సాగర్‌లో టీకాంగ్రెస్ నేతల సమావేశం
ఇవీ చూడండి: మానవత్వం లేని మగ మృగాలు
Last Updated : Jun 29, 2019, 7:53 AM IST