తెలంగాణ

telangana

ETV Bharat / state

వానొస్తే ముందుకు సాగలేం.. తిప్పర్తి అండర్​గ్రౌండ్​ బ్రిడ్జి దుస్థితి!

తిప్పర్తి మండలంలోని తిప్పర్తి – కన్నెకల్​ దారిలో వానొస్తే.. వర్షం నీటితో అండర్​ బ్రిడ్జి నిండి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పాటు మాడ్గులపల్లి మండలం చెర్వుపల్లి వెళ్లే దారిలో సైతం రైల్వే అండర్​ గ్రౌండ్​ బ్రిడ్జి ఇదే స్థితిలో ఉంది.

By

Published : Jul 30, 2020, 2:07 PM IST

Thipparthi Under bridge in Drained in Rain Water in Nalgonda
వానొస్తే ముందుకు సాగలేం.. తిప్పర్తి అండర్​గ్రౌండ్​ బ్రిడ్జి దుస్థితి!

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని తిప్పర్తి కన్నెకల్​ రహదారిలోని రైల్వే అండర్​ గ్రౌండ్​ బ్రిడ్జి, మాడ్గులపల్లి మండలం చెర్వుపల్లికి వెళ్లే దారిలోని రైల్వే అండర్​గ్రౌండ్​ బ్రిడ్జిల కింది నుంచి వానొస్తే ముందుకు సాగలేక వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. తిప్పర్తి మండలంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి రైల్వే అండర్​ బ్రిడ్జి వాననీటితో నిండిపోయింది. తిప్పర్తి నుంచి కన్నెకల్​కు వెళ్లే దారిలోని రైల్వే అండర్​ గ్రౌండ్​ బ్రిడ్జిలో ఐదు ఫీట్ల వరకు వర్షం నీరు చేరి.. బత్తాయి లోడుతో వెళ్తున్న లారీ బురదనీటిలో ఇరుక్కుపోయింది. ముందుకు గానీ.. వెనకకు గానీ కదలలేని బత్తాయి లారీని జేసీబీ సహాయంతో బయటికి లాగారు. ఈ రెండు రహదారుల్లోనూ వర్షం వచ్చిన ప్రతిసారి నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని ఆయా గ్రామాల ప్రజలు, వాహనచోదకులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details