తండ్రికి తలకొరివి పెట్టిన కర్మకాండ నిర్వహించాల్సిన పెద్దకొడుకు తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది . శాలిగౌరారానికి చెందిన రెబ్బ మల్లయ్య (83) అనే వృద్ధుడు విశ్రాంత జీవితం సాగిస్తూ అనారోగ్యంతో ఈ నెల 5న కన్నుమూసారు. దీంతో పెద్ద కుమారుడైన సోమ నర్సయ్య (55) తండ్రికి తలకొరివి పెట్టాడు. ఈ నెల 14న తండ్రి మల్లయ్య పెద్ద కర్మకాండలను పెద్ద కుమారుడు చేయాల్సి ఉండగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని మనోవేదనకు గురై గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందాడు.
తండ్రి చనిపోయాడనే మనోవేదనతో కుమారుడు మృతి - nalgonda district news
తండ్రి చనిపోయాడనే మనోవేదనతో కొడుకు గుండెపోటుతో మృతి చెందిన విషాధ సంఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో జరిగింది. తండ్రి మృతి చెందిన ఆరు రోజుల తర్వాత కుమారుడు మృత్యువాత పడడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తండ్రి చనిపోయాడనే మనోవేదనతో కుమారుడు మృతి
తండ్రి మృతి చెందిన ఆరవ రోజు కుమారుడు మృత్యువాత పడడం వల్ల కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమనర్సయ్య గత 20 ఏళ్ల పాటు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్‌గా అందరికీ సుపరిచితుడు కావడం వల్ల ఆయన మృతదేహాన్ని చూసి పలువురు కంటతడి పెట్టారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో మంగళవారం అంతిమయాత్ర నిర్వహించారు. మృతునికి భార్య ,కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఇవీ చూడండి: కరోనా అనుమానం: ఫ్యానుకు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య