తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలు నాటారు.. కానీ వాటి సంరక్షణ మరిచారు.. - nalgonda district news

తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం అపహాస్యమవుతోంది. నల్గొండ జిల్లాలోని శెట్టిపాలెం గ్రామంలో ఎంతో ఆర్భాటంగా నాటిన మొక్కలు సంరక్షించుకోకపోవడం వల్ల ఎండిపోయాయి. వర్షాలు పడుతున్నా మొక్కలు ఎండిపోయాయంటే అధికారుల పనితనంపై గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

neglegency in harithaharam programme in nalgonda district
మొక్కలు నాటారు.. కానీ వాటి సంరక్షణ మరిచారు..

By

Published : Aug 12, 2020, 2:30 PM IST

తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పచ్చదనానికై ఊరు వాడల్లో మొక్కలు నాటారు. గ్రామపంచాయతీల్లో వీలున్న చోట పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల వాటిని గాలికి వదిలేశారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో వేణుగోపాల స్వామి గుట్టల వద్ద సర్వే నెం.220లో ఒక ఎకరం స్థలాన్ని అధికారులు పల్లె పకృతి వనంకు కేటాయించారు. సర్పంచ్, గ్రామ, మండల స్థాయి అధికారులు ఎంతో ఆర్భాటంగా జులై 25న మొక్కలు నాటారు. కానీ వాటి సంరక్షణ మరిచిపోవడం వల్ల మొక్కలన్ని ఎండిపోయాయి. మొక్కలు నాటి చేతులు దులుపుకున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు.

వర్షాలు సమృద్ధిగా పడుతున్నా శెట్టిపాలెం గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలోని మొక్కలన్ని ఎండిపోయాయంటే .. ఫొటోలకు పోజులిచ్చే వీరి పనితనాన్ని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. వేములపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక భవనం వెనకాల 60 గుంటల స్థలాన్ని పల్లె ప్రకృతి వనానికి కేటాయించినా ఇంకా అక్కడ మొక్కలు నాటలేదు. రోజు చెదురు మొదురు వర్షాలు పడుతున్నప్పుడే మొక్కలు నాటినట్లైతే అవి బతికి చిగురిస్తాయని అప్పుడే ప్రభుత్వం చేపట్టిన హరితహారం లక్ష్యం నెరవేరుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఇవీ చూడండి: ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details