నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్ 12వ వార్డు కాలనీవాసుల తరఫున ఆశ వర్కర్లను సన్మానించారు. వారి సేవలను కొనియాడుతూ శాలువా, పూలమాలలతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ నాయకులు ధైద రవీందర్ హాజరయ్యారు.
నకిరేకల్‌లో ఆశ వర్కర్లను సన్మానించిన ధైద రవీందర్ - నల్గొండ జిల్లా నకిరేకల్
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని ఆశ వర్కర్ల కృషిని కొనియాడుతూ సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధైద రవీందర్ హాజరయ్యారు. ఆశ వర్కర్ల సేవలు ఎనలేనివని కొనియాడారు.
నకిరేకల్‌లో ఆశావర్కర్లకు సన్మానం
ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తున్న ఆశ వర్కర్ల కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. తదనంతరం ఆశ వర్కర్లు ఆఫీసులో కుర్చీలు, టేబుళ్లు, ఫ్యాన్లు కావాలని కోరారు. దానిపై స్పందించిన రవీందర్ వాటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్