కోదాడ సమీపంలోని రామాపురం వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దులో... పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలు నిలిపివేసి... హోల్డిండ్ పాయింట్లకు తరలించారు. ఆస్ట్రేలియా నుంచి ఇటీవలే స్వదేశానికి వచ్చి, సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లో నాగపూర్ వెళ్తున్న వ్యక్తిని... భువనగిరి రైల్వే స్టేషన్లో ఆపారు. సదరు వ్యక్తిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆలేరులో రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్లు వెలవెలబోయాయి. పట్టణంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఉమ్మడి జిల్లాలో జనతా కర్ఫ్యూ సక్సెస్
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రధానా రహదార్లు, కూడళ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
ఉమ్మడి జిల్లాలో జనతా కర్ఫ్యూ సక్సెస్
మిర్యాలగూడలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే ఉన్నాయి. వాడపల్లి చెక్‌పోస్టు మూసివేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారి నిర్మానుష్యంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు దేవరకొండలోనూ ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. పట్టణంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. చుట్టూ రైస్ మిల్లులతో ఎప్పుడు రద్దీగా ఉండే హుజూర్‌నగర్ కర్ఫ్యూతో వెలవెలబోయింది.