తెలంగాణ

telangana

ETV Bharat / state

మరికొద్దిసేపట్లో 'హాజీపూర్' కేసు విచారణ ప్రారంభం - Hajipur murder case to continue on second day in Nalgonda court

హాజీపూర్ హత్యల కేసుల్లో... ఇవాళ రెండోరోజు ప్రాసిక్యూషన్ వాదన కొనసాగుతోంది. నిన్న ఒక బాలిక కేసులో వాదనలు పూర్తి కాగా... నేడు మరో రెండు హత్యోదంతాల్లో విచారణ సాగనుంది. దారుణ దురాగతాలకు పాల్పడిన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి మరణశిక్ష విధించాలని వాదించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్... సాంకేతిక ఆధారాల్ని కోర్టుకు అందజేయనున్నారు.

Hajipur murder case to continue on second day in Nalgonda court
రెండో రోజు కొనసాగనున్న హాజీపూర్ బాలికల హత్య కేసు విచారణ

By

Published : Jan 7, 2020, 11:50 AM IST

సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో... విచారణ వేగంగా కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్లో వెలుగుచూసిన హత్యోదంతాలపై... నల్గొండ మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థాన పోక్సో చట్టం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

ఇవాళ మరో ఇద్దరి కేసుల్లోనూ... డీఎన్ఏ, ఫోరెన్సిక్ నివేదికల సారాంశాల్ని అందజేయనున్నారు. పోక్సో చట్టంతోపాటు వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్ని... ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉదహరించారు. 101 మంది సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన తర్వాతనైనా శ్రీనివాస్ రెడ్డికి కఠిన శిక్ష విధించాలని... న్యాయవాది కోర్టును కోరారు.

రెండో రోజు కొనసాగనున్న హాజీపూర్ బాలికల హత్య కేసు విచారణ

ఇదీ చదవండి:కడు పేదరికంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details