కేంద్రం చమురు ధరలు తగ్గించకుండా ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేయడం సరి కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే.... కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరలు పెంచుకుంటూ పోవడం హేమమైన చర్యగా అభివర్ణించారు.
ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్, సీఏఏ లకు వ్యతిరేకంగా 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీర్మానించినా... దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న ప్రధాని మోదీ ఇంత మొండిగా వ్యవహరిండం తగదన్నారు. రాష్ట్రంలో ఎన్‌పీఅర్ సేకరణకు సిబ్బందిని కేటాయించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.