తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి జిల్లాలో పెరుగుతోన్న మహమ్మారి బాధితులు

రాష్ట్రంలోని జిల్లాలలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నల్గొండ జిల్లా దేవరకొండలో ఎరువుల వ్యాపారికి మహమ్మారి సోకడం వల్ల ఏడుగురిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే యాదాద్రి జిల్లాలో ముగ్గురికి వైరస్‌ నిర్ధరణ కాగా.. సూర్యాపేట జిల్లా కోదాడలో తొలి కేసు నమోదైంది.

జిల్లాల్లో పెరుగుతోన్న మహమ్మారి బాధితులు
జిల్లాల్లో పెరుగుతోన్న మహమ్మారి బాధితులు

By

Published : Jun 26, 2020, 8:12 AM IST

నల్గొండ జిల్లాలో... కరోనా కేసులు క్రమంగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. దేవరకొండలో ఎరువుల దుకాణ యజమానికి వైరస్ సోకడం వల్ల ఏడుగురిని క్వారంటైన్ చేశారు. చింతపల్లి మండలానికి చెందిన మహిళ పాము కాటుకు గురై... హైదరాబాద్ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు కొవిడ్ నిర్ధరణ అవడంతోపాటు కోమాలో ఉన్నందున గాంధీ ఆసుపత్రికి తరలించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు కొవిడ్ కేసులకు గాను... జిల్లా కేంద్రంలో రెండు, పోచంపల్లి మండలంలో ఒకటి ఉన్నాయి. భువనగిరిలోని సూపర్ మార్కెట్ నిర్వాహకులైన దంపతులకు పాజిటివ్ తేలగా... 18 మందిని క్వారంటైన్ చేశారు. అటు భూదాన్ పోచంపల్లి మండలంలోని పల్లెకు చెందిన వ్యక్తిలో లక్షణాలు బయటపడ్డాయి.

ఇక సూర్యాపేట జిల్లా కోదాడలో... తొలి కేసు నమోదైంది. హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువకుడు... శుభకార్యం కోసం ఖమ్మం జిల్లాకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. నమూనాలు పరీక్షలకు పంపగా.. వైరస్‌ పాజిటివ్ నిర్ధరణ అయింది.

ఇవీ చూడండి:నెహ్రూ జూపార్క్​లో తెల్లపులి మృతి.. సీసీఎంబీకి రిపోర్టు!

ABOUT THE AUTHOR

...view details