తెలంగాణ

telangana

ETV Bharat / state

నిద్రమాత్రలు మింగి ఓ మహిళ ఆత్మహత్యా యత్నం - hospital senior assistant suicide

నాగర్​కర్నూల్​ జిల్లా ఆస్పత్రిలో సీనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న శ్రీదేవి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వైద్యులు అత్యవసర చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. వ్యక్తిగత కారణాల వల్లే నిద్ర మాత్రలు మింగినట్లు బాధితురాలు తెలిపింది.

women  sucide attempt in nagarkarnool district
నిద్రమాత్రలు మింగి ఓ మహిళ ఆత్మయత్నాయత్నం

By

Published : Apr 29, 2020, 11:53 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న శ్రీదేవి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉదయం డ్యూటీకి వచ్చిన శ్రీదేవి తన వెంట నిద్ర మాత్రలు తెచ్చుకుంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 30 మాత్రలు మింగింది. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది ట్యాబ్లెట్లను గుంజుకునే ప్రయత్నం చేయగా అప్పటికే ఆమె మింగేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆసుపత్రిలో చేర్చి ప్రథమ చికిత్స అందించారు. మింగిన మాత్రలను బయటకు కక్కించారు. అనంతరం ఐసీయూకి చేర్చి అత్యవసర చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. సాయంత్రం వరకు పూర్తిస్థాయిలో కోలుకుంది. ఆమెను డిశ్చార్జి చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. అయితే తన వ్యక్తిగత కారణాల వల్లనే నిద్ర మాత్రలు మింగినట్లు బాధితురాలు తెలియజేసింది.

ABOUT THE AUTHOR

...view details