నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఘనంగా ప్రారంభమయింది. ఈ ఉత్సవాలకు రాయలసీమ ప్రాంతం నుంచి హాజరయ్యే భక్తులు కృష్ణా నది మీదుగా నాటు పడవలపై వచ్చేవారు. గతం జరిగిన పలు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పడప ప్రయాణాన్ని రద్దు చేయడంతో వారు ఇబ్బందుల పాలవుతున్నారు.
నాటు పడవలు నిలిపివేత.. జాతరకు బస్సుల్లో సీమ భక్తులు
నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ప్రారంభమైంది. గతంలో జరిగిన పలు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ కృష్ణా నది మీదుగా నాటు పడవల ప్రయాణాన్ని పోలీసులు రద్దు చేయడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
కృష్ణానదిలో నాటు పడవ ప్రయాణాల నిలిపివేత
ప్రతి ఏటా సింగోటం గ్రామంలో జరిగే స్వామి వారి జాతరకు కృష్ణా నది పరివాహక, రాయలసీయ ప్రాంతాల నుంచి నాటు పడవలపై తరలివచ్చేవారు. 2007 జనవరి 18 తేదీన నాటు పడవ మునిగి 61 మంది జల సమాదవ్వగా గత నెల 29న నదిలో పశువులను ప్రమాదకరంగా తరలించిన ఘటనల దృష్ట్యా పోలీసులు ఈ సారి పడవ ప్రయాణాలను నిలిపివేశారు. ఈ కారణంగా బస్సుల ద్వారా చుట్టూ తిరిగి అధిక దూరం ప్రయాణించిజాతరకు చేరుకోవాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు.
ఇదీ చదవండి:త్వరలోనే కరోనా రహిత దేశంగా భారత్!: బిగ్‌బీ