నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపితే అడవి బిడ్డల ఉనికికే పెను ప్రమాదం ఏర్పడుతుందని వామపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీయం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నాయకురాలు పద్మ, సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి గుర్రం విజయ్ కుమార్, లోక్సత్తా రాష్ట్ర కార్యదర్శి మన్నారం నాగరాజుతో పాటు ఇతర నాయకులు నల్లమల ప్రాంతంలోని పర్యటించారు.
అడవి బిడ్డల కంటే యురేనియం గొప్పదా..? - వామపక్ష నేతలు
నల్లమల అటవీ ప్రాంతాన్ని వల్లకాడుగా మార్చడానికి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని వామపక్ష నేతలు ఆరోపించారు. యురేనియం తవ్వకాలు చేపడితే అడవి బిడ్డల ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
యురేనియం గొప్పదా..?
యురేనియం తవ్వకాల పేరుతో నల్లమల ప్రాంతాన్ని వల్లకాడుగా చేయడానికి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని వారు ఆరోపించారు. అడవి బిడ్డల జీవనం కంటే యూరేనియం గొప్పది కాదన్నారు. ప్రజల వినాశనానికి పెను ప్రమాదంగా మారుతున్న యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల ప్రజలు మరో స్వాతంత్ర పోరాటం చేయాలని వారు నినదించారు. ఈ పోరాటాలకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తుందని వారు హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: ఇకపై వ్యవసాయానికి మాత్రమే వ్యవసాయ రుణాలు