నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల కేంద్రంలో శివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి, బ్రహ్మం గారి దేవాలయం, ఆంజనేయ స్వామి, శివాలయం, కన్యకా పరమేశ్వరి దేవాలయాలు భక్తులతో కళకళలాడాయి.
భక్తులతో కళకళలాడిన ఆలయాలు - maha shivaratri 2020
కల్వకుర్తిలో శివరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలన్నీ శివ నామస్మరణలతో మార్మోగాయి.
భక్తులతో కళకళలాడిన ఆలయాలు
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి:యాదాద్రిలో కన్నుల పండువగా ఆది దంపతుల కల్యాణం