తెలంగాణ

telangana

ETV Bharat / state

30 రోజులకు పరిమితం కాదు... నిరంతర ప్రక్రియ - కలెక్టర్ శ్రీధర్

నాగర్​కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

వెల్దండ

By

Published : Sep 23, 2019, 4:30 PM IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం కేవలం 30 రోజులకే పరిమితం కాదని.. ఇది నిరంతర ప్రక్రియ అని నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్​ శ్రీధర్ అన్నారు. ​జిల్లాలోని వెల్దండ మండలం కేంద్రంతో పాటు, నగరగడ్డ తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వెల్దండ గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ.. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీవో సురేశ్​మోహన్, ఆర్డీవో రాజేశ్​ కుమార్, వెల్దండ జడ్పీటీసీ విజితారెడ్డి.. ఇతర అధికారులు పాల్గొన్నారు.

వెల్దండలో జిల్లా కలెక్టర్ పర్యటన..

ABOUT THE AUTHOR

...view details