నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తలను మొండాన్ని వేరు చేసి శిశువు మరణానికి కారణమైన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారి సుధాకర్లాల్ తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పందించారు. ఆస్పత్రికి వచ్చి బాధితులతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
శిశువు మరణంపై కలెక్టర్ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్ - BABY DEATH AT DELIVERY TIME HEAD AND BODY DIVIDED
ప్రసవం సమయంలో నిర్లక్ష్యం కారణంగా శిశువు తల, మొండెం వేరైన ఘటనలో ఇద్దరి వైద్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ శ్రీధర్ విచారణ చేపట్టారు.
![శిశువు మరణంపై కలెక్టర్ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్ COLLECTOR RESPONDED ON BABY DEATH IN NAGARKARNOOL HOSPITAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5442969-thumbnail-3x2-ppp.jpg)
COLLECTOR RESPONDED ON BABY DEATH IN NAGARKARNOOL HOSPITAL
శిశువు మరణంపై కలెక్టర్ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్
ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణిని పరీక్షలు చేసి సుఖప్రసవం చేయాల్సిన వైద్యులు... తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అచ్చంపేట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, డాక్టర్ సుధారాణిలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి:సుఖ ప్రసవం చేస్తామని... తలను మాత్రమే తీశారు