నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం చేస్తూ... శిశువు తలభాగం బయటకు తీసి మొండాన్ని కడుపులోనే వదిలేశారు వైద్యులు.
నడింపల్లి గ్రామానికి చెందిన స్వాతి 3 రోజుల క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. సుఖప్రసవం జరుగుతుందని వైద్యులు చెప్పినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
మూడో రోజు వైద్యులు డెలివరీ చేస్తున్న సమయంలో తల భాగం తెగిపోయి మొండం కడుపులోనే ఉండిపోయింది. ఈ క్రమంలో మహిళ పరిస్థితి విషమంగా మారటం వల్ల వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించగా... ఆపరేషన్ చేసి తలలేని మొండాన్ని బయటకు తీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు చికిత్స అందిస్తున్నారు. ఇదంతా వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ మహిళ కుటుంబం ఆస్పత్రిలో ఆందోళనకు దిగింది. వైద్యులపై దాడికి దిగగా.... అడ్డుకున్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇవీ చూడండి: పిచ్చికుక్కల స్వైర విహారం.. 12 మందికి గాయాలు