నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పలు కాలనీల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ దాడిలో 12 మందికి గాయాలయ్యాయి. వారిని పట్టణ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ప్రథమచికిత్స అందించి... మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు దాడి చేసిన పిచ్చికుక్కలను హతమర్చడానికి 8 మంది సిబ్బందిని రెండు బృందాలుగా పంపించి.. చంపించినట్లు తెలిపారు. శనివారం పట్టణంలోని వీధికుక్కలను పట్టుకుపోవడానికి ప్రత్యేక టీమ్ వస్తుందని.. మున్సిపల్ అధికారి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం