తెలంగాణ

telangana

ETV Bharat / state

సుఖ ప్రసవం చేస్తామని... తలను మాత్రమే తీశారు - Achchampeta Government Hospital doctors Negligence

9నెలలు మోసి... ఇంకొద్ది సేపట్లో తన బిడ్డ బయటకు వస్తోందని ఆనందపడ్డ ఆ తల్లికి గర్భశోకమే మిగిల్చారు ఆ నిర్లక్షపు వైద్యులు. ప్రసవం చేస్తూ... తలను మాత్రమే బయటకు తీసి మొండాన్ని కడుపులోనే వదిలేసి.. ప్రాణం పోయాల్సిన వైద్యులే పసిపాపను కడుపులోనే చిదిమేశారు.

Achchampeta Government Hospital doctors Neglect Negligence in Nagar Kurnool District
సుఖ ప్రసవం చేస్తామని... తలను మాత్రమే తీశారు

By

Published : Dec 20, 2019, 6:02 PM IST

Updated : Dec 20, 2019, 9:09 PM IST

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం చేస్తూ... శిశువు తలభాగం బయటకు తీసి మొండాన్ని కడుపులోనే వదిలేశారు వైద్యులు.

నడింపల్లి గ్రామానికి చెందిన స్వాతి 3 రోజుల క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది. సుఖప్రసవం జరుగుతుందని వైద్యులు చెప్పినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

మూడో రోజు వైద్యులు డెలివరీ చేస్తున్న సమయంలో తల భాగం తెగిపోయి మొండం కడుపులోనే ఉండిపోయింది. ఈ క్రమంలో మహిళ పరిస్థితి విషమంగా మారటం వల్ల వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. హుటాహుటిన హైదరాబాద్​కు తరలించగా... ఆపరేషన్​ చేసి తలలేని మొండాన్ని బయటకు తీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు చికిత్స అందిస్తున్నారు. ఇదంతా వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ మహిళ కుటుంబం ఆస్పత్రిలో ఆందోళనకు దిగింది. వైద్యులపై దాడికి దిగగా.... అడ్డుకున్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇవీ చూడండి: పిచ్చికుక్కల స్వైర విహారం.. 12 మందికి గాయాలు

Last Updated : Dec 20, 2019, 9:09 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details