ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్న బోయిన్ పల్లి గ్రామంలో అధికారుల తీరును నిరసిస్తూ వరి ధాన్యం కుప్పకు రైతులు నిప్పంటించారు. కొనుగోలు కేంద్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదని అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటే పట్టా పాస్బుక్ చూపించాలంటూ అధికారులు కోరారు. చాలా కాలం నుంచే పోడు భూముల్లో పంటలు పండించుకుంటున్నామని రైతులు తెలిపారు.
కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం వేశామని...పట్టా పాసు పుస్తకాలు ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని మార్కెట్ అధికారులు తేల్చి చెప్పారు. అధికారుల వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ ధాన్యం కుప్పకు నిప్పంటించి అన్నదాతలు నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పండించిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
పంట కొనమంటే పాస్ బుక్ అడుగుతారా? వరి కుప్పకి నిప్పు - MARKET YARD OFFICERS ARE ASKING LAND PASS BOOKS SAYS FARMERS
వారు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే అన్నదాతలు. తాము పండించిన పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తే...అధికారులు పట్టా పాస్ పుస్తాకాలు చూపించాలంటూ పేచీ పెట్టారు. అధికారుల తీరును నిరసిస్తూ యార్డులోని వరి కుప్పను రైతులు తగులబెట్టారు.
అధికారుల తీరును నిరసిస్తూ పంటకు నిప్పు పెట్టిన రైతులు
ఇవీ చూడండి : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గవర్నర్ తండ్రి