ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో సీఆర్పీఎఫ్ తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించారు. వారు అజ్ఞాత సభ్యులు చెప్పిన పనులు చేసే కుర్పం రమేష్ , మీడియం చిన్న లక్ష్మయ్యగా గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. కొత్తపల్లి క్రాస్ రోడ్ దగ్గరలో కల్వర్టు కింద కార్డేక్స్ వైర్, టిఫిన్ బాక్స్ అమర్చాలని ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అనుమానంతో అరెస్టు చేసి రిమాండ్కు పంపారు.
ములుగు జిల్లాలో ఇద్దరు మావోలు అరెస్టు - MULUGU
ములుగు జిల్లా కొత్తపల్లిలో ఇద్దరు మావోయిస్టులను సీఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. కొత్తపల్లి క్రాస్ రోడ్ వద్ద కల్వర్టు కింద బాంబు అమర్చడానికి ప్రయత్నిస్తుంటే అనుమానంతో పట్టుకున్నారు.
ములుగు జిల్లాలో ఇద్దరు మావోలు అరెస్టు