ములుగు జిల్లా కలెక్టర్‌గా ఈరోజు అదనపు బాధ్యతలు చేపట్టిన కర్ణన్ ఇవాళ మేడారంలో పర్యటించారు. క్యూలైన్లలో భక్తుల రద్దీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీతో కలిసి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇక్కట్లు కలుగకుండా జాతరను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు.
మేడారంలో భక్తుల దర్శనాలకే అధిక ప్రాధాన్యత - ములుగు జిల్లా మేడారం జాతర నేటి వార్తలు
మేడారం జాతరకు వచ్చే భక్తుల సులభ దర్శనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ కర్ణన్ పేర్కొన్నారు. జాతరకు వచ్చే జనమంతా ఒకే చోట గుమిగూడకుండా పర్యవేక్షిస్తున్నామన్నారు.
మేడారంలో భక్తుల దర్శనాలకే అధిక ప్రాధాన్యత
భక్తులకు మేడారం పర్యటన ఒక మంచి అనుభూతిగా గుర్తుండేలా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్‌పాటిల్ అన్నారు. పరస్పర సహకారంతో జాతరను విజయవంతం చేయాలని కోరారు. ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకుంటామని, వాహనదారులు వాహనాలను ఓవర్‌టేక్ చేస్తూ ప్రమాదాలకు గురికావద్దని సూచించారు.
ఇదీ చూడండి : 'వారి బంధాన్ని చావు కూడా విడదీయలేకపోయింది'