రామప్ప ఆలయాన్ని టూరిజం హబ్‌లా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రామప్పకు అంతర్జాతీయ గుర్పింపు లభించిన తరుణంలో... ప్రపంచ స్థాయిలోని పర్యటకులను రప్పించే విధంగా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా... ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సందర్శించారు. అర్చకులు మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అభివృద్ధికి సహకరించాలి..
"విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా రామప్ప వద్ద సకల సౌకర్యాలు కల్పిస్తాం. రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం... దేశానికే గర్వకారణం ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర విభజనకు ముందు కాకతీయ కళావైభవం నిర్లక్ష్యానికి గురైంది. రామప్పకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావటం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ ఎంతో ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి స్థానికులు సహా ప్రజాప్రతినిధులందరూ సహకరించాలి."
- శ్రీనివాస్ గౌడ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి