తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారంలో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ప్రత్యేక పూజలు - mulugu district news

మేడారానికి సారలమ్మ బయలుదేరగా.. పొలిమేర్లకు పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకున్నారు. గద్దె మీదకు వనదేవతలు ఎప్పుడు వస్తారా.. అని భక్తజనం ఎదురుచూస్తోంది. మేడారంలో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి పర్యటించారు.

సారలమ్మను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి
సారలమ్మను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

By

Published : Feb 5, 2020, 7:55 PM IST

Updated : Feb 5, 2020, 9:06 PM IST

మేడారంలో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ప్రత్యేక పూజలు

ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి మేడారానికి బయలుదేరిన సారలమ్మ మరికాసేపట్లో గద్దె మీదకు చేరుకోనుంది. డప్పు వాయిద్యాల నడుమ సారలమ్మను ఊరేగింపుగా పూజారులు తీసుకువస్తున్నారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో జంపన్న వాగు మీదుగా తల్లి రానుంది.

మేడారం పొలిమేర్లకు పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకున్నారు. మేడారంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్‌ పర్యటించారు. అమ్మవార్లకు ఇంద్రకరణ్​ రెడ్డి నూతన వస్త్రాలు సమర్పించారు. జంపన్నవాగు జనసంద్రంగా మారగా.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

ఇవీ చూడండి:మేడారం స్పెషల్: జుట్టు అమ్మకుంటే ఆడాళ్లైనా అరగుండే..!

Last Updated : Feb 5, 2020, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details