" ఒకప్పుడు జంపన్న వాగుకు సంపెంగ అని పేరు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుని చేతిలో సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు మరణించారు. కాకతీయ సైన్యంతో...వీరోచితంగా పోరాడిన జంపన్నను హతమార్చేందుకు వారు దొంగదెబ్బ తీస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంపన్న, శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం అవమానకరంగా భావించి.. అక్కడే ఉన్న సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేస్తాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్నవాగుగా మారింది."
మేడారం జాతరకొచ్చే భక్తులకు జంపన్న వాగు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. జాతరలో... రద్దీ ఎలా ఉందో... వాగు పరిసర ప్రాంతాలను చూస్తే తెలుస్తుంది.