తెలంగాణ

telangana

హరితహారంలో మొక్కలు నాటిన.. అటవీశాఖ అధికారి

By

Published : Jul 2, 2020, 9:46 PM IST

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ములుగు జిల్లా అటవీ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి మొక్కలు నాటారు. హరితహారం సమయంలో మాత్రమే కాకుండా నిత్యం పచ్చదనాన్ని కాపాడే బాధ్యత మనందరి మీద ఉందని ఆయన అన్నారు.

District Forest Officer Participated In Haritha Haram
హరితహారంలో మొక్కలు నాటిన.. అటవీశాఖ అధికారి

ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ శాఖ అధికారి ప్రదీప్​ కుమార్​ మొక్కలు నాటారు. జూన్ 25వ తేదీన జిల్లాలో కలెక్టర్ ప్రారంభించిన హరితహారం లక్ష్యాన్ని పూర్తిచేశామన్నారు. జిల్లావ్యాప్తంగా ఏడు శాఖల సమన్వయంతో కలిసి.. 21 లక్ష మొక్కలు నాటామన్నారు.

నిర్దేశించుకున్న లక్ష్యం కంటే అదనంగా మొక్కలు నాటుతున్నామని ఆయన తెలిపారు. 290 మంది అటవీ శాఖ సిబ్బంది గురువారం ఒక్కరోజే ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ నిఖిత , ములుగు రేంజ్ ఆఫీసర్ రామ్మోహన్, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు, పాల్గొన్నారు.

ఇద చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ABOUT THE AUTHOR

...view details