తెలంగాణ కుంభమేళా అయిన మేడారం జాతరలో భక్తుల సందడి అప్పుడే నెలకొంది. తెలంగాణ నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. జాతరలో తల్లుల దర్శనం కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారం చేరుకుంటున్నారు. డ్రోన్ కెమెరా చిత్రీకరించిన గిరిజన జాతర అందాలు ఆకట్టుకుంటున్నాయి.
మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్ దృశ్యాలు - మేడారం జాతర వార్తలు
అంబరమంటే సంబురానికి ముహూర్తం సమీపించింది. కీకారణ్యం జనారణ్యంగా మారే సమయం వచ్చేసింది. రేపట్నుంచి ఘనంగా ప్రారంభమయ్యే మేడారం జాతరకు భక్తుల రద్దీ అప్పుడే మొదలైంది.
మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్ దృశ్యాలు
భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పర్యావరణం కాపాడేందుకు భక్తులు ప్లాస్టిక్ వస్తువులు తీసుకొని రావద్దని అధికారులు ఇదివరకే విజ్ఞప్తి చేశారు. రేపట్నుంచి నాలుగు రోజుల పాటు జాతర కోలాహలంగా జరుగనుంది.