తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ - devotees rush at medaram jatara mulugu district

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి గద్దెలకు తాళం వేయగా బయటనుంచే దర్శనం చేసుకుంటున్నారు.

devotees rush at medaram jatara
మేడారంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ

By

Published : Jan 17, 2020, 4:33 PM IST

మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న వన దేవతల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జాతర సమీపిస్తున్న భక్తుల తాకిడి అధికమవుతోంది.

మేడారంలో ఎక్కడ చూసినా భక్తుల సమూహాలు, వాహనాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాలు నుంచి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

అమ్మవారి గద్దెలకు అధికారులు తాళం వేయడంతో బయట నుంచే దర్శించుకుంటున్నారు. పెరిగిన భక్తులకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు తమ సేవలను అందిస్తున్నారు.

మేడారంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ

ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

ABOUT THE AUTHOR

...view details