ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు ఇప్పటి నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పిల్లాపాపలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ తీరు పట్ల భక్తుల్లో ఆసహనం వ్యక్తం అవుతోంది. జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలు ఉన్నప్పటికీ స్నానాలు చేసేందుకు నల్లాలు లేవని భక్తులు వాపోతున్నారు.
బట్టలు మార్చుకునే గదులేవి..?
బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు నిర్మించకపోవడం పట్ల మహిళ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ... వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జంపన్న వాగు వంతెన సమీపంలో ఇరువైపులా నల్లాలు బిగించి బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.