మేడారం... ఓ మహా నగరాన్ని తలపిస్తుంది. రాష్ట్ర అధికార యంత్రాంగమంతా... మేడారంలోనే బస చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు సంబంధించి జరిగిన ఘటనలపై సత్వర పరిష్కారం చూపించేందుకు కోర్టును సైతం ఏర్పాటు చేశారు. మేడారంలోని ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ఆవరణలో మొబైల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 వరకు క్యాంపు కోర్టును మేడారంలో నిర్వహించాలన్న కలెక్టర్ నిర్ణయం మేరకు క్యాంప్ కోర్టును ఏర్పాటు చేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని... సుదూర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తులు క్షణికవేశంలో కేసుల పాలవుతారన్న న్యాయమూర్తి... వ్యయ ప్రయాసలకోర్చి కోర్టుల చుట్టూ తిరగకుండా సత్వర పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
జాతరలో క్యాంపు కోర్టు... కేసులకు సత్వర తీర్పు
మేడారం జాతరలో భక్తులకు ఏవిధంగానూ ఇబ్బంది కాకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడెక్కడి నుంచే వచ్చిన భక్తులు క్షణిణావేశంలో గొడవలకు దిగి... కేసులైతే కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోకూడదని క్యాంపు కోర్టు కూడా పెట్టారు.
CAMP COURT IN MEDARAM