తక్కువ సమయంలో ఎక్కువ యారో షాట్స్ కొట్టి ప్రపంచ వండర్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సొంతం చేసుకుంది చందన సాయి అంజన. మేడ్చల్ జిల్లా గాజుల రామారం పాఠశాలలోని విద్యార్థిని చందన సాయి అంజన యారో షాట్స్‌పై గత ఆరు నెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. నేడు జరిగిన ఈవెంట్లో పదిహేను నిమిషాల పదిహేను సెకండ్లలోనే రెండు రికార్డులను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
నిర్ణీత సమయంలో కొట్టాల్సిన లక్ష్యం 76 యారో షాట్స్ మాత్రమే ఉండగా... విద్యార్థిని 136 షాట్స్ కొట్టడం వల్ల ప్రపంచ రికార్డు నమోదైంది. ప్రపంచ వండర్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కడం వల్ల విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు గురువులూ ఆనందం వ్యక్తం చేశారు.