ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ పీటర్ సిడిల్... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆసీస్ తరఫున 11 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన ఈ బౌలర్... ఆదివారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అనుహ్యంగా ప్రకటించాడు.
షాక్‌లో సహచర క్రికటెర్లు
35 ఏళ్ల సిడిల్.. అనూహ్యంగా వీడ్కోలు పలకడంపై సహచర క్రికెటర్లు షాకయ్యారు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఈ విషయం చెప్పాడు. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికైనా.. తుది జట్టులో మాత్రం ఇతడికి చోటు దక్కలేదు.
-
Congratulations to Peter Siddle, a champion of our game, who has today announced his retirement from international cricket. He finished with 221 Test wickets, including a memorable Ashes hat-trick on his birthday at the Gabba. Thanks for the memories Sidds! pic.twitter.com/Rl8UChz8pI
— Cricket Australia (@CricketAus) December 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to Peter Siddle, a champion of our game, who has today announced his retirement from international cricket. He finished with 221 Test wickets, including a memorable Ashes hat-trick on his birthday at the Gabba. Thanks for the memories Sidds! pic.twitter.com/Rl8UChz8pI
— Cricket Australia (@CricketAus) December 28, 2019Congratulations to Peter Siddle, a champion of our game, who has today announced his retirement from international cricket. He finished with 221 Test wickets, including a memorable Ashes hat-trick on his birthday at the Gabba. Thanks for the memories Sidds! pic.twitter.com/Rl8UChz8pI
— Cricket Australia (@CricketAus) December 28, 2019
" రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే తగిన సమయమని భావిస్తున్నా. ఆసీస్ జట్టుకు ఆడటాన్ని గొప్పగా భావిస్తున్నా. యాషెస్‌లో ఆడాలన్న నా కోరిక తీరిపోయింది. కాస్త బాధతోనే క్రికెట్‌కు ముగింపు పలుకుతున్నాను"
-- పీటర్ సిడిల్, ఆస్ట్రేలియా క్రికెటర్
సిడిల్ తొలి వికెట్ సచిన్
2008లో క్రికెట్లో అరంగేట్రం చేసిన సిడిల్... తొలివికెట్‌గా దిగ్గజ సచిన్ తెందూల్కర్‌ను ఔట్ చేశాడు. తన టెస్టు కెరీర్లో 67 మ్యాచ్‌ల్లో 221 వికెట్లు తీశాడు. ఐదు వికెట్ల మార్కును ఎనిమిదిసార్లు అందుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్ల జాబితాలో 13వ స్థానంలో ఉన్నాడు.
20 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు సిడిల్. కెరీర్లో ఒక హ్యాట్రిక్ ఉంది. ఆసీస్ తరఫున చివరగా యాషెస్ సిరీస్‌లో పాల్గొన్నాడు. దేశవాళీ క్రికెట్, బిగ్‌బాష్ లీగ్, ఇంగ్లీష్ కౌంటీల్లో మాత్రం ఈ పేసర్ ఆడనున్నాడు.
-
An #Ashes hat-trick.
— Wisden (@WisdenCricket) December 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
At the Gabba.
On his birthday.
Peter Siddle has announced his retirement from international cricket. What a career he has had 👏pic.twitter.com/lmMzjr9eSp
">An #Ashes hat-trick.
— Wisden (@WisdenCricket) December 29, 2019
At the Gabba.
On his birthday.
Peter Siddle has announced his retirement from international cricket. What a career he has had 👏pic.twitter.com/lmMzjr9eSpAn #Ashes hat-trick.
— Wisden (@WisdenCricket) December 29, 2019
At the Gabba.
On his birthday.
Peter Siddle has announced his retirement from international cricket. What a career he has had 👏pic.twitter.com/lmMzjr9eSp