తెలంగాణ

telangana

ETV Bharat / state

తప్పుల తడకగా ముసాయిదా ఓటర్ల జాబితా - దుండిగల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల తప్పులు

మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పులు దొర్లకుండా చేస్తామంటున్న అధికారుల మాట ముమ్మాటికి తప్పని నిరూపిస్తోంది వారి తీరు. వార్డుల వారీగా కులగణను ఒకటికి రెండు సార్లు చేసినా... తప్పులను మాత్రం గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

votes issue at dundigal
తప్పుల తడకగా మూసాయిదా ఓటర్ల జాబితా

By

Published : Jan 2, 2020, 4:33 PM IST

Updated : Jan 2, 2020, 4:46 PM IST

మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. వార్డుల వారీగా కులగణనను చేసిన అధికారులు తప్పులను గుర్తించకలేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

పలు వార్డులలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం, మృతిచెందిన వారికి ఓట్లు ఇవ్వడంపై రాజకీయ నాయకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రెండు ఇంటి నంబరులపై భారీ మొత్తంలో ఓట్లు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డికి ఫిర్యాదు చేశారు.

మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు, కులగణన చేసినప్పటికీ తప్పులు దొర్లడం పట్ల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తప్పుల తడకగా ముసాయిదా ఓటర్ల జాబితా

ఇవీ చూడండి: వెలుతురులేమితో వాహనాలు పరస్పరం ఢీ

Last Updated : Jan 2, 2020, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details