తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2020, 4:07 PM IST

ETV Bharat / state

క్వారీలో పడి అన్నాతమ్ముడి మృతి

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పిల్లలకు ఇచ్చిన సెలవులే వారి పాలిట శాపంగా మారాయి. తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ వెళ్లి ఓ నీటి గుంతలో పడి మృతి చెందారు.

TWO BOYS DIED IN MEDCHAL
క్వారీలో పడి అన్నాతమ్ముడి మృతి

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్​లో విషాదం చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పాఠశాలలకు సెలవులు ఇవ్వగా... అదే కాలనీకి చెందిన ఆరో తరగతి చదివే హేమంత్, నాల్గో తరగతి చదువుతున్న రాహుల్​ ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. అలా వెళ్లిన అన్నాతమ్ముళ్లకు మట్టి మాఫియా వాళ్లు తవ్విన గుంతలు కనిపించాయి. అందులో వర్షపు నీరు నిలిచి ఉండటం వల్ల స్నానం కోసమని అందులోకి దిగారు.

గుంత లోతుగా ఉండటం వల్ల పిల్లలిద్దరూ అందులో మునిగిపోయారు. విషయం గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాలుర మృతదేహాలను బయటకు తీయించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకూ తమ కళ్ల ముందే ఆడుకున్న పిల్లలిద్దరూ ఒకేసారి మృతి చెందడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

క్వారీలో పడి అన్నాతమ్ముడి మృతి

ఇవీ చూడండి:కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో రక్తానికి కొరత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details