తెలంగాణ

telangana

ETV Bharat / state

మౌలాలి: ఆగి ఉన్న రైలు బోగిలో మంటలు - మౌలాలి: ఆగి ఉన్న రైలు బోగిలో మంటలు

మౌలాలి రైల్వే స్టేషన్‌లో అగి ఉన్న రైలులో ఒక బోగి మంటల్లో కాలిపోయింది. అందులో ప్రయాణికులు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

fire accident at moulali railway station
మౌలాలి: ఆగి ఉన్న రైలు బోగిలో మంటలు

By

Published : Mar 14, 2020, 4:09 PM IST

హైదరాబాద్ మౌలాలి రైల్వే స్టేషన్​లో ఆగి ఉన్న సికింద్రాబాద్-కాకినాడ రైల్లోని ఒక బోగి మంటలకు ఆహుతైంది. అదృష్టవశాత్తు అందులో ఎవరూ ఉండకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బోగిలోంచి పొగలు రావడం గమనించిన రైల్వే సిబ్బంది అగ్నిపమాక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

నిరుపయోగంగా ఉన్న ఆ బోగి మంటల్లో పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదం విద్యుదాఘాతంతో జరిగిందా లేక ఇంకెమైన కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మౌలాలి: ఆగి ఉన్న రైలు బోగిలో మంటలు

ఇదీ చూడండి:సంజయ్ మంజ్రేకర్​పై బీసీసీఐ వేటు!

ABOUT THE AUTHOR

...view details