ఎన్ని ఫిర్యాదులు చేస్తాం... అసలు కళాశాలలో ఉమెన్‌సెల్ లేదు... ఫంక్షన్లకు వచ్చే మల్లారెడ్డి... ఇప్పుడు ఎందుకు రావడంలేదు.. ఇప్పుడు రావాల్సిందే... ఓ విద్యార్థి వేదన
అమ్మాయిలకు రక్షణ లేదా... ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఓ మంత్రి కళాశాలలోనే అమ్మాయికి రక్షణ కరువైంది... ల్యాబ్ ఇంఛార్జ్‌ని మీరైనా చంపేయండి.. లేదా మాకు అప్పజెప్పండి. --- మరో విద్యార్థి వేదన
'ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదు' - 'ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదు'
''మంత్రిగారు... మీ కళాశాలలోనే మహిళలకు రక్షణ కరువైతే... ఎలా? కనీసం మీరు ఇప్పటివరకైనా... దీనిపై స్పందించారా? ఓట్ల కోసం వచ్చే మీరు... ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు... మీరు వెంటనే కళాశాలకు రావాల్సిందే... '' మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల మాటలివి. ఓ విద్యార్థినిపై ల్యాబ్ ఇంఛార్జ్ అత్యాచారం చేయడంపై ఇవాళ కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు.
'ఓట్ల కోసం వచ్చే మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదు'
అమ్మాయిలు సరిగ్గా బట్టలు వేసుకోండి అని చెప్తుంటారు.... మరి యూనిఫాం వేసుకున్నాక కూడా ఇలా జరిగింది? వేశాధారణలో కాదు... మీ ఆలోచనల్లో మార్పు రావాలి. --- మరోవిద్యార్థి వేదన
ఇవీ చూడండి: మల్లారెడ్డి కళాశాలలో అత్యాచార ఘటనపై విద్యార్థుల ఆందోళన
Last Updated : Dec 27, 2019, 3:16 PM IST