మోదీ, కేసీఆర్‌పై మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ చౌకీదారైతే కేసీఆర్ తాపీదార్ అని ఎద్దేవా చేశారు.ప్రధాని పదవిపై ఆశ లేదని భువనగిరి సభలో కేసీఆర్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్‌కు ఓటేసి ఎవరిని ప్రధానిని చేయాలని నిలదీశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రసూల్‌పుర, బొల్లారం, తిరుమలగిరి, కార్ఖానాలో భారీ సంఖ్యలో యువత ద్విచక్ర వాహానాలతో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రతి అంశంలో మోదీకి మద్దతు ఇస్తూనే ఉన్నారన్నారు. 16 సీట్లలో ఒక్కటి కూడా మైనార్టీ సోదరులకు ఇవ్వలేదని విమర్శించారు.
మోదీ చౌకీదారైతే కేసీఆర్ తాపీదార్: రేవంత్
ప్రధాని పదవిపై ఆశలేదన్న కేసీఆర్‌కు ఓటేసి ఎవరిని ప్రధాని చేయాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీ చౌకీదారైతే కేసీఆర్ తాపీదార్ అని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్లో నిర్వహించిన రోడ్‌షోలో యువత భారీగా పాల్గొన్నారు.
మోదీ చౌకీదారైతే కేసీఆర్ తాపీదార్: రేవంత్