తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2020, 10:57 PM IST

ETV Bharat / state

ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

మేడ్చల్‌ జిల్లా బౌరంపేటలో ఓ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు తగ్గించాలని గురువారం ఆందోళన చేపట్టారు. ఫీజుల విషయం చర్చించడానికి సమయం ఇవ్వాలని అడుగుతున్నా యాజమాన్యం నిరాకరించినట్లు ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30 శాతం ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

మేడ్చల్ జిల్లా బౌరంపేటలోని ది క్రీక్ ప్లానెట్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు తగ్గించాలని గురువారం ఆందోళన చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగాలకు కోతబడటం, వ్యాపారాలు మూతబడినందున ఫీజులు తగ్గించాలని కోరుతున్నా యాజమాన్యం సానుకూలంగా స్పందించడం లేదన్నారు. ఫీజుల విషయం చర్చించడానికి సమయం ఇవ్వాలని అడుగుతున్నా యాజమాన్యం నిరాకరించినట్లు పేర్కొన్నారు.

గత కొద్దిరోజులుగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యం నెలనెల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత శాతం పీజులు చెల్లించినప్పటికీ కొంతమందికి ఆన్‌లైన్‌ తరగతులు నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30 శాతం ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?

ABOUT THE AUTHOR

...view details