తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. షోకాజ్ నోటీసు జారీ చేసిన కలెక్టర్​ - hyderabad today news

ఎన్నికల విధుల్లో ఓ జీహెచ్​ఎమ్​సీ ఉద్యోగి నిర్లక్ష్యం వహించాడు.. డిప్యూటీ కమిషనర్ పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు.. చివరకు కలెక్టర్​ తనిఖీల్లో దొరికిపోయాడు. ఈ సంఘటన కుత్బుల్లాపూర్‌లో చోటుచేసుకుంది.

Negligence on election duties the Collector was caught in checks at qutubullapur
ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. షోకాజ్ నోటీసు జారీ చేసిన కలెక్టర్​

By

Published : Jan 13, 2020, 6:36 AM IST

ఎన్నికల విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించిన జీహెచ్​ఎమ్​సీ సూపర్​వైజర్​పై మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్​ నోటీసు జారీ చేశారు. కుత్బుల్లాపూర్‌ జీహెచ్​ఎమ్​సీ కార్యాలయంలో బిల్ కలెక్టర్​గా పనిచేస్తున్న నర్సింగరావును మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సుపర్​వైజర్​గా నియమించారు. 1 తేదీ నుంచి అతను విధులకు హాజరుకావడం లేదు.

విధులకు రావడం లేదని కుత్బుల్లాపూర్‌ డిప్యూటీ కమిషనర్ మంగతయారు పలుమార్లు హెచ్చిరించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎమ్.వి.రెడ్డి ఆదివారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఆకస్మికంగా వచ్చారు. అక్కడ డ్యూటీలో ఉండాల్సిన నర్సింగరావు లేకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయవల్సిందిగా డిప్యుటి కమిషనర్​కు ఆదేశాలిచ్చారు. మంగతాయారు నర్సింగ్​రావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. షోకాజ్ నోటీసు జారీ చేసిన కలెక్టర్​

ఇదీ చూడండి : ఆహా ఏమిరుచి: పనసాకు పొట్టిక్క... రుచిలో దిట్టక్క!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details