లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ముస్లింలకు మల్లాపూర్ 5వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు వంగేటి సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వీఎన్ఆర్ గార్డెన్లో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సుమారు 1000 మంది ముస్లింలకు నిత్యావసర సరకులను అందజేశారు.
ముస్లింలకు నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎంపీ రేవంత్ రెడ్డి - ఎంపీ రేవంత్ రెడ్డి
కరోనా మహమ్మారి నివారణ కోసం ప్రజలందరూ స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఎంపీ రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించటంతోపాటు భౌతిక దూరం పాటించి కరోనాను అరికట్టాలన్నారు.
medchal district latest news
కరోనా వ్యాప్తి వల్ల ఉపాధి లేక కనీసం రంజాన్ పండగ కూడా జరుపుకోలేని స్థితిలో పేద ముస్లింలు ఉన్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో నిత్యావసర సరకులు అందించిన సంజీవ రెడ్డిని అభినందించారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి... ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి, ప్రవీణ్ రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.