తెలంగాణ

telangana

వెయ్యి మందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రులు

By

Published : Apr 21, 2020, 2:54 PM IST

కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ జై జవాన్ నగర్​లో పలువురు మంత్రులు వెయ్యి మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.

Ministers supplied essentials to a thousand people in kapra medchal
వెయ్యి మందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రులు

మేడ్చల్ జిల్లా కాప్రా జైజవాన్ నగర్​లో వెయ్యి మంది పేదలకు మంత్రులు నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డిలు పాల్గొన్నారు.

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని వారు సూచించారు. మే 7 వరకు లాక్​డౌన్​ అందరూ పాటించాలన్నారు. తెలంగాణలో పేదలకు అన్నివిధాలా ఆదుకోడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

ఇదీ చూడండి :పోలీసులకు హారతులు..పూలవర్షం

ABOUT THE AUTHOR

...view details