లాక్డౌన్ వేళ పేదలను ఆదుకోడానికి దాతలు ముందుకు రావాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో సుమారు 700 మంది పేదలకు భోజనం ప్యాకెట్లను మంత్రి పంపిణీ చేశారు. కష్ట సమయంలో పేదలను ఆదుకున్నవారే గొప్పవారన్నారు.
'కష్టకాలంలో పేదలను ఆదుకున్నావారే గొప్పోళ్లు'
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌లో మంత్రి మల్లారెడ్డి పేదలకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. కష్ట సమయంలో పేదలను ఆదుకోవాలని మంత్రి సూచించారు.
'కష్టకాలంలో పేదలను ఆదుకున్నావారే గొప్పవారు'
జిల్లాలో కరోనా ప్రభావం తగ్గు ముఖం పట్టినప్పటికీ ముప్పు మాత్రం ఇంకా పొంచి ఉందన్నారు. ఎక్కడైనా కరోనా లక్షణాలతో ఎవరైనా కన్పిస్తే... ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయాలని కోరారు. కరోనాను పూర్తిగా నిర్మూలించేందుకు 15 రోజుల పాటు కఠిన నిర్ణయాలు, జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.