కార్మికులు రక్తం చిందించి, పోరాడి తమ హక్కులను సాధించిన గొప్ప రోజు మేడే అని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. జాతి నిర్మాణంలో,నాగరికత వికాసంలో కార్మికుల చెమట, రక్తం ఉందన్నారు. మేడే సందర్భంగా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, నగర పాలక సంస్థ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్మికులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. లాక్డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని, వారి సేవలను ఎప్పటికీ గుర్తించాలన్నారు.
కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి మల్లారెడ్డి
మేడే సందర్భంగా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి మల్లారెడ్డి కొత్త బట్టలు, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి మల్లారెడ్డి