తెలంగాణ

telangana

ETV Bharat / state

'మేడ్చల్ ఆస్పత్రి తనిఖీ... ఇకపై మూడు నెలలకోసారి సమీక్ష' - MEDCHAL HOSPITAL INSPECTED BY MINISTER MALLAREDDY

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఇకపై ప్రతీ మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.

మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి మల్లారెడ్డి

By

Published : Dec 2, 2019, 6:42 PM IST

మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి మల్లారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో అక్కడే సమీక్ష నిర్వహించారు. వైద్యులకు కావలసిన వసతులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే వైద్య వివరాలను ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్టును అందిస్తున్నారా లేదా అని వాకబు చేశారు. ప్రతీ మూడు నెలలకోసారి ఆసుపత్రిలో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.


ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని... వివిధ విభాగాలకు సంబంధించి తగిన నియామకాలు చేసుకోమని వైద్యులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. మల్లారెడ్డి వైద్య కళాశాలకు చెందిన వైద్యులు కూడా ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారన్నారు. సమీక్షలో జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ శరత్ చంద్రా రెడ్డి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి మల్లారెడ్డి

ఇవీ చూడండి : స్ప్రేతో మంటలు.. పుట్టినరోజు అపశ్రుతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details