పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మిత్రులతో కలిసి ఆనందంగా బర్త్డే వేడుకలు చేసుకుంటున్నాడు. కేక్ కట్ చేసే ముందు క్యాండిల్ వెలిగించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలోనే స్నో స్ప్రే కొట్టడం వల్ల మంటలు చెలరేగాయి. పుట్టిన రోజు జరుపుకుంటున్న అబ్బాయి మొహానికి మంటలు అంటుకున్నాయి. వెంటనే మిత్రులంతా కలిసి మంటలను ఆర్పి వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇవీ చూడండి: 'దిశ' హత్యాచారంపై రాజ్యసభలో విపక్షాల గళం