రాష్ట్రంలో పదహారు స్థానాల్లో గెలిస్తే గల్లీ నుంచి దిల్లీ వరకూ గులాబీ జెండానే ఎగురుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ తెరాస అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి తరఫున రోడ్‌షోలో పాల్గొన్నారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోయిందని, కాంగ్రెస్‌కు ఓటేయడం కంటే మూసిలో పారేయడం మంచిదన్నారు. కారు గుర్తుపై ఓటేసి తెరాస ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఎంపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
దిల్లీలో యాచించి కాదు శాసించి నిధులు తెచ్చుకుందాం - ktr
ప్రచారానికి ఒక్కరోజే మిగులున్నందున ప్రధాన పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరింది. రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థలపై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ తెరాస అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి తరఫున తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బాలానగర్‌లో రోడ్‌షోలో పాల్గొన్నారు.
మల్కాజిగిరి లోక్‌సభ తెరాస అభర్థి తరఫున కేటీఆర్ ప్రచారం