తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2021, 6:56 AM IST

ETV Bharat / state

అటవీశాఖ అధికారులతో వాగ్వాదం.. ఒకరిపై ఒకరి కేసులు

అటవీశాఖ భూముల్లో చదును చేస్తుండగా అడ్డుకున్న అటవీ సిబ్బందితో ఆక్రమణదారులు వాగ్వాదానికి దిగిన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామరంలో జరిగింది. అటవీశాఖ, ఆక్రమనదారులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

అటవీశాఖ అధికారులతో భూ ఆక్రణదారుల వాగ్వాదం
అటవీశాఖ అధికారులతో భూ ఆక్రణదారుల వాగ్వాదం

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలో అటవీశాఖ ఆధ్వర్యంలో 70 ఎకరాలకు పైగా అటవీ భూమి ఉంది. దీనికి ఆనుకుని గాజులరామారం గ్రామం సర్వే నెంబర్​ 28లో కూన జైకుమార్ గౌడ్​కు 2 ఎకరాల 09 గుంటల భూమి ఉంది. దాని ఆధారంగా సరిహద్దులో ఉన్న అటవీ భూముల్లో కూన జైకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జేసీబీతో రాళ్లు, చెట్లను తొలగించి చదును చేస్తున్నారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఒకరిపై ఒకరు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదుల చేసుకున్నారు. ఉన్నతాధికారుల సలహా మేరకు ఫిర్యాదులను పరిశీలించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:19 జిల్లాల్లో నేడు డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details