మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి భరత్‌నగర్‌లో మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. మల్కాజిగిరి ఏసీపీ, ఏడుగురు ఇన్స్పెక్టర్లు, 22 మంది ఎస్సైలతో సహా మొత్తం 121 మంది పోలీస్ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు.
'మల్కాజిగిరి భరత్ నగర్లో పోలీసుల కార్డన్ సెర్చ్' - Bharath nagar Cordon Search DCP Rakshitha murthy
నేర నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. స్థానికంగా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే.. వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మేడ్చల్ మల్కాజిగిరి భరత్‌నగర్‌లో ఆమె ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు.
DCP Rakshitha Murthy
సరైన పత్రాలు లేని 21 ద్విచక్రవాహనాలు జప్తు చేసి... ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా అనుమానితులెవరైన కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ సూచించారు. ఎవరైన ఇబ్బందులకు గురిచేస్తే... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఇదీ చూడండి: ఇస్నాపూర్‌లో తల్లి, కొడుకు అదృశ్యం